●
మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు
వేసవి సాఫ్ట్‌బాల్ శిక్షణ శిబిరంలో కొద్ది రోజుల్లోనే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. కొత్లబా ద్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరం గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఈ శిబిరంలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను గుర్తించి వారికి రెగ్యులర్ శిక్షణ అందజేస్తాం.
– లక్ష్మినారాయణ,
సాఫ్ట్‌బాల్ కోచ్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించడానికి జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంపిక చేసిన 10 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మొదటిసారిగా కోయిలకొండ మండలంలోని కొత్లబాద్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 1వ తేదీ నుంచి సాఫ్ట్‌బాల్ శిబిరం కొనసాగుతోంది. కొత్లబాద్, మల్లాపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 25 మంది బాలబాలికలు శిబిరంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు ప్రోత్సాహంతో కోచ్‌లు లక్ష్మినారాయణ, మమత విద్యార్థులకు శిక్షణ అందజేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు సాఫ్ట్‌బాల్ వేసవి శిక్షణా శిబిరం ప్రతిభకు వేదికలా నిలుస్తుంది. శిబిరంలో మొదట విద్యార్థులకు వార్మప్, ఫిట్‌నెస్ ట్రైనింగ్ అందజేస్తున్నారు. బేసిక్ అంశాలైన రోల్ బాల్స్, ఫీల్డింగ్, క్యాచింగ్, బేస్ రన్నింగ్, స్లగ్గింగ్, పిచ్చింగ్ ఇస్తున్నారు. విద్యార్థుల త్రో, హ్యాండ్ పవర్‌ను బట్టి పిచ్చింగ్, స్లగ్గింగ్‌పై శిక్షణ అందజేస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో విద్యార్థులకు రెండు జట్లుగా విభజించి మ్యాచ్‌లు ఆడిపిస్తున్నారు.
కొత్లబాద్‌లో
వేసవి సాఫ్ట్‌బాల్ శిబిరం
ఉత్సాహంగా శిక్షణ
తీసుకుంటున్న విద్యార్థులు


