కానిస్టేబుల్‌ అదృశ్యం.. కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ అదృశ్యం.. కేసు నమోదు

May 16 2026 1:09 AM | Updated on May 16 2026 1:09 AM

బల్మూర్‌: మండలంలోని తోడెళ్లగడ్డకు చెందిన పిట్టల మోహన్‌ అనే కానిస్టేబుల్‌ అదృశ్యంపై శుక్రవారం కేసు నమోదు చేసినుట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన మోహన్‌ భువనగిరి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా ఈ నెల 13న తన స్వ గ్రామానికి వచ్చా డు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో పెళ్లి విషయంలో ఘర్షణ పడి ఇంటి నుంచి బైక్‌పై వెళ్లి పోయాడు. అనంతరం తాను హైదరాబాద్‌లో ఉనా ్ననని బీబీనగర్‌ మండలం గూడు రుకు చెందిన సరిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు ఫోన్‌లో సమాచారం ఇచ్చి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసుకున్నాడు. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కానిస్టేబుల్‌ తండ్రి పిట్టల శేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement