‘మా కుటుంబానికి ఉన్న ఒక్క ఆధారం ఈ చిన్న పొలమే. ఎకరం భూమిలోనే చిన్న షెడ్డు వేసుకుని.. గేదెలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు భారత్‌మాల రోడ్డు పేరుతో 30 గుంటల భూమి పోతే మాకు మిగిలేది ఏముంటుంది? మా పిల్లలను ఎలా పోషించాలి? మా జీవితం ఎలా కొనసాగాలి? మొదట రోడ్డు వేరే వైపు తీస్తామని చెప్పారు. ఇప్పుడు మా పొలం మీదుగా తీసుకొస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయడం మంచిదే కానీ పేద రైతుల బతుకులు నాశనం కాకూడదు. మాకు ఉన్నది ఇదొక్కటే బతుకుదెరువు. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకుని రోడ్డు మార్గాన్ని మార్చాలని, మా పొలాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం..’ అని మహబూబ్‌నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన గొల్ల నర్సిములు యాదవ్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.


