రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రంగారెడ్డి జిల్లాలో ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీలకు 32 మంది జిల్లా విద్యార్థులు ఎంపికై నట్లు స్పోర్ట్స్‌ కిక్‌బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ తెలిపారు. విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులను జిల్లాకేంద్రంలో డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి అభినందించారు. రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టీమ్‌ కోచ్‌ నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement