గోవా వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
వనపర్తి రూరల్: పెబ్బేరుకు చెందిన నలుగురు కారులో గోవాకు వెళ్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెబ్బేరుకు చెందిన తోకల రాజశేఖర్, మహేష్, భానుప్రకాష్, శంకర్ నలుగురు కలిసి శుక్రవారం రాత్రి కారులో గోవాకు బయలుదేరారు. మార్గమధ్యంలో హుబ్లీ వద్ద రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో తోకల రాజశేఖర్(44), మహేష్ (39) అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు భానుప్రకాష్, రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందిన తోకల రాజశేఖర్‌కు కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మహేష్‌కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబాలకు వీరే ఆధారంగా ఉండంతో వారి మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో పెబ్బేరులో విశాదం అమలుకుంది.


