● 2.5 ఎకరాలల్లో పంట దగ్ధం
పాన్‌గల్: మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన రైతు రవీందర్‌రెడ్డికి చెందిన మొక్కజొన్న పంటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. 2.5 ఎకరాలల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా కాలిపోవడంతో పాటు పొలంలో ఉన్న 30 స్పింక్లర్ పైపులు, విద్యుత్ మోటార్, వైర్లు దగ్ధమయ్యాయని వాపోయాడు. వీటి విలువ సుమారుగా రూ.2.50 లక్షలు ఉంటుందని రైతు తెలిపాడు.


