పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పూర్వవిద్యార్థులు యూనివర్సిటీలో భాగస్వాములుకావాలని పీయూ వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పీయూలో విద్యావారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీయూలో చదివి వివిధ స్థాయి ల్లో విద్యార్థులు పనిచేయడం గొప్ప విషయమని, జీవితంలో ముందుకు వెళ్తున్న యూనివర్సిటీతో అనుబంధం కొనసాగించాలని సూచించారు. పూర్వ విద్యార్థుల అనుభవాలు, విజయాలు ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతు న్న విద్యార్థులకు మార్గదర్శనం కావాలన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు చదువు ఒక్కటే కాదని, దానితో పాటు స్కిల్స్‌ కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమలకు అవసరమైన విధంగా విద్యార్థులు సిద్ధం కావాలని పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, కంట్రోలర్‌ ప్రవీణ, ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, కుమారస్వామి, అనురాధారెడ్డి, మాళవి, కరుణాకర్‌రెడ్డి, నూర్జహాన్‌, కృష్ణయ్య పాల్గొన్నారు.

‘బెస్ట్‌ అవైలబుల్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలోని పలు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 1, 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి గల ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కులం, ఆదాయం, బోనాఫైడ్‌ సర్టిఫికెట్లతో జూన్‌ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 10వ తేదీన లాటరీ విధానంలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ @ రూ.2,415

దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్‌ యార్డులో గురువారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,415, కనిష్టంగా రూ.2,329గా ధరలు లభించాయి. మార్కెట్‌కు కేవలం 500 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

● నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం జొన్నలు క్వింటా గరి ష్టంగా రూ.5,026, కనిష్టంగా రూ.4,856 ధర పలికాయి. వడ్లు సోన గరిష్టంగా రూ.2,521, కనిష్టంగా రూ.1,663 ధర లభించింది.

బ్లాక్‌ స్పాట్‌ల పరిశీలన

మహబూబ్‌నగర్‌ క్రైం: ఇటీవల నగరంలో తర చూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ లో భాగంగా గురువారం రాత్రి అదనపు ఎస్పీ రత్నం ఆధ్వర్యంలో మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారుల బృందం బ్లాక్‌ స్పాట్‌ ఏరియాలను సందర్శించారు. రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రమాదాలని వారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదనంగా చేపట్టాల్సిన భద్రత చర్యలపై క్షుణ్ణంగా పరిశీలించారు. రహదారులపై హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు, రిఫ్లెక్టర్లు, విద్యుత్‌ దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు ఇజాజుద్దీన్‌, అప్పయ్య, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, భాస్కర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement