టీ20 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ శుభారంభం | - | Sakshi
Sakshi News home page

టీ20 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ శుభారంభం

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హైదరాబాద్‌లోని 22 యార్డ్స్‌ మైదానంలో మంగళవారం జరిగిన హెచ్‌సీఏ బి–డివిజన్‌ టీ–20 లీగ్‌ కమ్‌ నాకౌట్‌ టోర్నమెంట్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు శుభారంభం చేసింది. మహబూబ్‌నగర్‌ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఉస్మానియా యూనివర్సిటీ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. జట్టులో హయాన్‌ ఆరిఫ్‌ మొహియోద్దీన్‌ 45 పరుగులు నాటౌట్‌, సూర్య కిరణ్‌ యాదవ్‌ 45 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్‌ బౌలర్లు జస్వంత్‌ 2 వికెట్లు, శశాంక్‌, వర్షిత్‌రెడ్డి, ఎండి.ముఖితుద్దీన్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్‌ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులో అభిలాష్‌గౌడ్‌ అర్ధసెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 8 ఫోర్లతో 54 పరుగులు చేయగా సంజయ్‌ 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ–20 లీగ్‌లో జిల్లా జట్టు మ్యాచ్‌ గెలుపొందడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ అభినందించారు. ఇదే స్పూర్తితో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.

ఐదు వికెట్ల తేడాతో ఓయూ జట్టుపై విజయం

Advertisement
 
Advertisement
Advertisement