మక్తల్: ఒండుమట్టి తరలించే టిప్పర్, బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మక్తల్ మండలం గొల్లపల్లి స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా.. మక్తల్ మండలం మంతన్‌గోడ్‌కు చెందిన సంగంబండ హన్మంతు(60) బైక్‌పై మక్తల్‌కు వస్తుండగా.. మక్తల్ చెరువు నుంచి ఒండును తరలిస్తున్న టీప్పర్ ఢీకొంది. దీంతో ముందు టైర్లకింద బైక్, హన్మంతు పడి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలుపుకున్న మక్తల్ పోలీసులు ఘనటా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మక్తల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకొని బోరున విలపించారు. కూమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ధన్వాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఏంనోనిపల్లి స్టేజీ వద్ద హైదరాబాద్– మక్తల్ హైవేలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మరికల్ మండలం బుడ్డగానితండాకు చెందిన సోమ్లానాయక్ (45) తండానుంచి గుండిగడ్ల శివారులో కౌలుకు తీసుకున్న భూమి వద్దకు బైకుపై వెళ్తున్నాడు. ఏంనోనిపల్లి శివారు వద్ద ముందు అగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చెట్టుపై నుంచి పడి కూలీ మృతి
మహబూబ్‌నగర్ క్రైం: కొబ్బరి చెట్టుకున్న టెంకాయలు కోయడానికి వెళ్లిన ఒక కూలీ అదుపు తప్పి నిచ్చెనపై నుంచి పడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. టికొండ గ్రామానికి చెందిన శ్రీశైలం(40) నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కొబ్బరి చెట్టుకు టెంకాయలను కోయడానికి నిచ్చెన వేసుకొని ఎక్కాడు. చెట్టు పూర్తిగా ఎక్కిన తర్వాత నిచ్చెన విరిగిపోవడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


