న్యూస్‌రీల్
మహబూబ్‌నగర్
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
నగరంలో వారంలో రెండుసార్లే తాగునీటి సరఫరా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని 60 డివిజన్లకు వారంలో రెండుసార్లు మాత్రమే మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. శుద్ధనీటి సరఫరా అంటున్నా.. ఒండ్రుతో కలిసి వస్తుండటంతో దాదాపు 90 శాతం ప్రజలు ఈ నీటిని తాగడమే లేదు. ఎక్కడికక్కడ ప్రైవేట్ ఆర్‌ఓ ప్లాంట్లు, ట్రాలీ ఆటోల ద్వారా వచ్చే నీటికి డబ్బులిచ్చి క్యాన్లలో పట్టుకుంటున్నారు. సుమారు మూడు లక్షల జనాభా కలిగిన మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28 చోట్ల ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. నెలలో కనీసం రెండుసార్లు అన్నిచోట్ల క్లారిఫొక్లేటర్ క్లీనింగ్ (ఫిల్టర్‌బెడ్‌లో అడుగున చేరిన బురద, మట్టిని తొలగించే పని) చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నా.. ఒకసారి మాత్రమే ఈ ప్రక్రియ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతోంది. ప్రస్తుతం వేసవి కావడంతో ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రత్యామ్నాయంగా సుమారు 700 పవర్ బోర్లు ఉండటంతో మిగతా రోజుల్లో వీటిని ఆశ్రయిస్తున్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఒండ్రుతో వస్తున్న శుద్ధజలం
సుమారు 3 లక్షల జనాభాకు సరిపోక ఇబ్బందులు
ప్రత్యామ్నాయంగా పవర్ బోర్లతోసరిపెడుతున్న వైనం
‘సాక్షి’ బృందం పరిశీలనలోవెలుగులోకి వాస్తవ పరిస్థితులు


