● ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్
● పాలమూరులో వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ
శిబిరం ప్రారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని సోమవారం ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముడా చైర్మన్ మాట్లాడుతూ క్రికెటర్లు ఆటపై ఆసక్తి, పట్టుదలతో ఆడాలని సూచించారు. మైదానంలో అభివృద్ధి పనులకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు క్రికెట్‌లో రాష్ట్రానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. జిల్లా క్రికెటర్లు ఇండియాకు, ఐపీఎల్‌లో ఆడాదని, మిమ్మల్ని టీవీలో చూడాలనే ఆకాంక్ష ఉందన్నారు. ఇష్టపడి, పట్టుదలతో క్రికెట్ ఆడి ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను గుర్తించి అండర్–14, 16 జట్లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను రానున్న హెచ్‌సీఏ టోర్నమెంట్‌లకు ఎంపిక చేస్తామన్నారు. అనంతరం ముడా నిధులతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీజేఏసీ మాజీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మేఘ్యానాయక్, ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కార్యదర్శి రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, ఎండీ మన్నాన్, ముఖ్తార్‌అలీ, ఆబిద్ హుస్సేన్, సీనియర్ క్రీడాకారుడు రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.


