విద్యార్థులకు విద్యతోపాటు సంస్కారం, దేశభక్తిని పెపొందించే విధంగా వందేమాతరం ఫౌండేషన్ ద్వారా శిక్షణ తరగతులను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాం. మూడో తరగతి విద్యార్థుల నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల వరకు శిబిరంలో చేర్చుకుని వారికి చదువుతోపాటు వివిధ కళల నైపుణ్యాల గురించి శిక్షణ ఇస్తున్నాం. 16 శిక్షణ శిబిరాలలో మొత్తం 3వేలమంది విద్యార్థులకు 96మంది వలంటీర్లతో తరగతులను నిర్వహిస్తున్నాం. నెలపాటు విద్యార్థులకు ఇంటి పనులతోపాటు స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రి, గురువు, పెద్దలను గౌరవించే విధంగా వారిలో ప్రేరణ కలిగిస్తున్నాం.
– మాధవరెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
●


