ద‌క్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్‌.. ఎవరంటే? | Bavuma ruled out of the Zimbabwe Tests due to injury | Sakshi
Sakshi News home page

ద‌క్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్‌.. ఎవరంటే?

Jun 20 2025 7:30 PM | Updated on Jun 20 2025 7:46 PM

Bavuma ruled out of the Zimbabwe Tests due to injury

జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల‌ టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ టెంబా బావుమా తొడ కండ‌రాల గాయం కార‌ణంగా జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శుక్ర‌వారం ధ్రువీక‌రించింది. అత‌డి స్ధానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న కేశ‌వ్ మ‌హారాజ్‌కు జ‌ట్టు ప‌గ్గాల‌ను సౌతాఫ్రికా క్రికెట్ అప్పగించింది.

కాగా బావుమా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా గాయపడ్డాడు. తొడ కండరాల నొప్పితో బాధపడతూనే తన బ్యాటింగ్‌ను టెంబా కొనసాగించాడు. తన విరోచిత పోరాటంతో సౌతాఫ్రికాకు 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను అందించాడు. అయితే అతడు గాయం కాస్త తీవ్రమైనది కావడంతో బావుమా నుంచి జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారు. 

అదేవిధంగా ఈ సిరీస్‌కు ఐడైన్ మార్‌క్ర‌మ్‌, క‌గిసో ర‌బాడ కూడా దూరంగా ఉండనున్నారు. బావుమా ఆగ‌స్టులో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే వ‌న్డే సిరీస్‌కు తిరిగి జ‌ట్టులో చేరే అవ‌కాశ‌ముంది. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్‌లో పాకిస్తాన్‌తో ప్రోటీస్ జ‌ట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ సౌతాఫ్రికాకు అదే తొలి సిరీస్ కానుంది. జూన్ 28 నుంచి జింబాబ్వే-సౌతాఫ్రికా మ‌ధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

జింబాబ్వేతో టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా జ‌ట్టు
డేవిడ్ బెడింగ్‌హామ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రీవిస్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడీ (రెండో టెస్టు మాత్రమే), లువాన్-డ్రే ప్రిటోరియస్, లెసెగో సెనోక్వానే, ప్రెనెల్ సెనోక్వానే
 

Advertisement
 
Advertisement
Advertisement