డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు సౌతాఫ్రికా కీల‌క నిర్ణ‌యం | South Africa To Face Zimbabwe For One-Off Test Before WTC Final | Sakshi
Sakshi News home page

WTC Final 2025: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు సౌతాఫ్రికా కీల‌క నిర్ణ‌యం

May 5 2025 8:33 PM | Updated on May 5 2025 9:07 PM

South Africa To Face Zimbabwe For One-Off Test Before WTC Final

వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2023-25 ఫైన‌ల్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదిక‌గా జూన్ 11 నుంచి 15 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న తుది పోరులో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండో సారి టైటిల్‌ను సొంతం చేసుకోవాల‌ని ఆసీస్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా సైతం తొలిసారి ట్రోఫీ ముద్దాడాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ క్ర‌మంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఈ ఫైన‌ల్‌కు ముందు జింబాబ్వేతో సౌతాఫ్రికా నాలుగు రోజుల టెస్టు ఆడ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మే ఆఖ‌రి వారంలో ఈ మ్యాచ్ జ‌రిగే అవ‌కాశ‌ముంది. అదేవిధంగా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ స‌న్న‌హాకాల్లో భాగంగా ప్రోటీస్ జ‌ట్టు జూన్ 3న ససెక్స్‌తో కూడా తలపడనుంది. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా స్టార్ ఆట‌గాళ్లు ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. 

గ్రూపు స్టేజి ముగిసిన త‌ర్వాత కొంత‌మంది స‌ఫారీ ఆట‌గాళ్లు నేరుగా ఇంగ్లండ్‌కు ప‌యనం కానున్నారు. మిగిలిన ప్లేయ‌ర్లు మే 25న ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత సౌతాఫ్రికా జ‌ట్టులో చేర‌నున్నారు. ఈ ఫైన‌ల్‌కు ముందు మ‌రో గుడ్ న్యూస్ సౌతాఫ్రికాకు అందింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ కగిసో రబాడ‌ ప్రపంచ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (వాడా) తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.

అత‌డు తిరిగి మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు. తొలుత డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ర‌బాడ దూరం కానున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు నిషేదం ఎత్తేయ‌డంతో సౌతాఫ్రికా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
చ‌ద‌వండి: వయసుతో పనేంటి?.. అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్‌ ఆడతాడు: వరుణ్‌ చక్రవర్తి

Advertisement
 
Advertisement
Advertisement