బంగ్లాకు భారీ షాక్‌.. జింబాబ్వే సంచ‌ల‌న విజ‌యం | Zimbabwe script historic comeback to beat Bangladesh in Sylhet Test | Sakshi
Sakshi News home page

BAN vs ZIM: బంగ్లాకు భారీ షాక్‌.. జింబాబ్వే సంచ‌ల‌న విజ‌యం

Apr 23 2025 5:19 PM | Updated on Apr 23 2025 6:02 PM

Zimbabwe script historic comeback to beat Bangladesh in Sylhet Test

బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టుకు వారి సొంత‌గ‌డ్డ‌పై ప‌సి కూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. సిల్హాట్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 3 వికెట్ల తేడాతో జింబాబ్వే విజ‌యం సాధించింది. 174 ప‌రుగుల ల‌క్ష్యాన్ని జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో  బ్రియాన్‌ బెన్నెట్‌ (52) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..బెన్ కుర్రాన్‌(44) ప‌రుగుల‌తో రాణించారు.

బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో మెహాది హ‌స‌న్ మిరాజ్ ఐదు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. తైజుల్ ఇస్లాం రెండు వికెట్లు సాధించాడు. కాగా ఇది జింబాబ్వేకు నాలుగేళ్ల త‌ర్వాత‌ ద‌క్కిన తొలి టెస్టు విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌.. జింబాబ్వే బౌల‌ర్లు చెల‌రేగడంతో త‌మ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో మొద‌టి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది.

జింబాబ్వే బౌల‌ర్ల‌లో ముజరబానీ, వెల్లింగ్టన్‌ మసకద్జ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..  న్యాయుచి, మదెవెరె చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం జింబాబ్వే త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (57), సీన్‌ విలియమ్స్‌ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్‌కీపర్‌ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్‌ నగరవ (28 నాటౌట్‌) ప‌ర్వాలేద‌న్పించారు.

బంగ్లాదేశ్‌ బౌలర్లలో మెహిది హసన్‌ మిరాజ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్‌ రాణా 3, హసన్‌ మహమూద్‌, ఖలీద్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లా బ్యాటర్లు తీరు ఏ మాత్రం మార‌లేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 255 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

కెప్టెన్ శాంటో(60), జాకీర్‌(58), మోమిన‌ల్‌(47) మిన‌హా మిగితా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ప‌ర్యాట‌క జ‌ట్టు చేధించింది. బంగ్లాపై జింబాబ్వేకు ఇది రెండో టెస్టు విజ‌యం. కాగా ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ ఏప్రిల్ 28 నుంచి ఛ‌టోగ్రామ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

Advertisement
 
Advertisement
Advertisement