
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో సౌతాఫ్రికాను 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
కివీస్ ఓపెనర్లు సీఫర్ట్(22), కాన్వే(9) ఆరంభంలోనే ఔటయ్యారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ డార్లీ మిచెల్(5), వికెట్ కీపర్ హే(5) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ సమయంలో టిమ్ రాబిన్సన్(75), డెవాన్ జాకబ్స్(44).. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 105 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాక రెండు, ఎంగిడీ, ముత్తుసామి, కోట్జీ తలా వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో బ్రెవిస్(35) టాప్ స్కోరర్‌గా నిలవగా.. లిండే(30), ప్రిటోరియస్(27) పర్వాలేదన్పించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, జాకబ్ డఫీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సోధీ రెండు, శాంట్నర్ ఓ వికెట్ సాధించారు.
చదవండి: Virat kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా