ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేను (Afghanistan vs Zimbabwe) వారి సొంత గడ్డపై ఊడ్చేసింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (నవంబర్ 2) జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (92), ఇబ్రహీం జద్రాన్ (60) చెలరేగారు. ఆఖర్లో సెదిఖుల్లా అటల్ (35 నాటౌట్) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ఈవాన్స్ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే సైతం అద్భుతంగా పోరాడింది. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 201 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (51), బ్రియాన్ బెన్నెట్ (47), ర్యాన్ బర్ల్ (37), ముసేకివా (28) పోరాడారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అహ్మద్‌జాయ్ 3, ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ తలో 2, ముజీబ్, నబీ చెరో వికెట్ తీశారు.
ఈ సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


