నవంబర్ 6న గోల్డ్‌కోస్ట్ వేదికగా భారత్‌తో జరుగబోయే నాలుగో టీ20కి ముందు ఆస్ట్రేలియా సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్ ట్రవిస్ హెడ్‌ను (Travis Head) జట్టు నుంచి విడుదల చేశారు. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని ఆదేశించారు.
ఆసీస్ సెలెక్టర్ల ఈ నిర్ణయం యాషెస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగా తీసుకోబడింది. పని భారం తగ్గించే క్రమంలో హెడ్‌కు చివరి రెండు టీ20లకు విశ్రాంతి కల్పించారు. హెడ్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారో సెలెక్టర్లు చెప్పలేదు.
అంతకుముందు మరికొందరు సీనియర్లను కూడా భారత్‌ను ఎదుర్కొనే టీ20 జట్టు నుంచి రిలీజ్ చేశారు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ షెఫీల్డ్ షీల్డ్‌లో న్యూసౌత్ వేల్స్ తరఫున ఆడతారు. కెమరూన్ గ్రీన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
హెడ్ భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో హెడ్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. రెండో టీ20లో 28, మూడో మ్యాచ్‌లో 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన హెడ్.. అంతకుముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 8, 28, 29 స్కోర్లు చేశాడు.
కాగా, ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-1 సమంగా ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా, మూడో మ్యాచ్‌లో భారత్ గెలుపొందాయి.
భారత్‌తో నాలుగు, ఐదు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్లి బియర్డ్‌మన్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఇల్లిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా
చదవండి: విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ


