జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో (Zimbabwe vs Afghanistan) భాగంగా ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (92), ఇబ్రహీం జద్రాన్ (60) ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా గుర్భాజ్ (Rahmanullah Gurbaz) శివాలెత్తిపోయారు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు.
ఆఖర్లో సెదిఖుల్లా అటల్ (15 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. వేగంగా పరుగులు చేసే క్రమంలో షాహిదుల్లా కమల్ (10) ఔటయ్యాడు. నబీ ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్ 2 వికెట్లు తీయగా.. రిచర్డ్ నగరవ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేలో పర్యటిస్తుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధన


