
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం నమీబియా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 15) తొలి మ్యాచ్ జరుగుతుంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (51 బంతుల్లో 94; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మరుమణి (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
ర్యాన్ బర్ల్ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సికందర్ రజా (11 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బ్యాటర్లు చెలరేగి ఆడుతుండటంతో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ తనతో సహా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. అలెగ్జాండర్ 2, ట్రంపల్‌మెన్‌కు ఓ వికెట్ దక్కింది
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా కూడా ధీటుగా బదులిస్తుంది. 7 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 70 పరుగులు చేసింది. జాన్ లాఫ్టన్ (20 బంతుల్లో 37), జాన్ ఫ్రైలింక్ (9 బంతుల్లో 18) ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ మలాన్ క్రూగర్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు.