జింబాబ్వే పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తొలి విజయం నమోదు చేసింది. తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌లో ఘోర పరాజయం (ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో) ఎదుర్కొన్న ఆ జట్టు.. నిన్న (అక్టోబర్ 29) జరిగిన టీ20లో 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఇబ్రహీం జద్రాన్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (39), సెదిఖుల్లా అటల్ (25), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (27), షాహీదుల్లా (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా 3 వికెట్లతో సత్తా చాటగా.. బ్లెస్సింగ్ ముజరబానీ 2, బ్రాడ్ ఈవాన్స్ ఓ వికెట్ తీశారు.
అనంతరం 181 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (3-0-20-4), ఒమర్‌జాయ్ (4-0-29-3), అహ్మద్‌జాయ్ (2.1-0-20-2) ధాటికి 16.1 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది.
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లయ్యారు. తొమ్మిదో నంబర్ ఆటగాడు మపోసా (32) టాప్ స్కోరర్ కాగా.. బ్రియాన్ బెన్నెట్ (24), బ్రాడ్ ఈవాన్స్ (24), టోనీ మున్యోంగా (20), తషింగ ముసేకివా (16) రెండంకెల స్కోర్లు చేశారు. రెండో టీ20 అక్టోబర్ 31న జరుగనుంది.
చదవండి: టీ20 సిరీస్ విండీస్‌దే


