మ‌మ్మ‌ల్నే ఓడిస్తారా? ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్‌ | Mehidy Hasan Miraz Stars As Bangladesh Register Big Win vs Zimbabwe | Sakshi
Sakshi News home page

ZIM vs BAN: మ‌మ్మ‌ల్నే ఓడిస్తారా? ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్‌

Apr 30 2025 8:22 PM | Updated on Apr 30 2025 8:22 PM

Mehidy Hasan Miraz Stars As Bangladesh Register Big Win vs Zimbabwe

జింబాబ్వేతో తొలి టెస్టులో ఎదురైన ఓట‌మికి బంగ్లాదేశ్ ప్ర‌తీకారం తీర్చుకుంది. చటోగ్రామ్ వేదిక‌గా జరిగిన రెండో టెస్టులో జింబాబ్వేను ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో బంగ్లా జ‌ట్టు చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 227 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో సీన్ విలియ‌మ్స్‌(67), నిక్ వెల్చ్(54) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. బంగ్లా బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ తైజుల్ ఇస్లాం 6 వికెట్లు ప‌డ‌గొట్టి జింబాబ్వే ప‌త‌నాన్ని శాసించాడు. అత‌డితో పాటు నయీమ్ హసన్ రెండు, తాంజిమ్ ఒక్క వికెట్ సాధించారు. 

అనంత‌రం బంగ్లాదేశ్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 444 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో షాద్మాన్ ఇస్లాం(120), మెహిదీ హసన్ మీరాజ్(104) అద్బుత‌మైన సెంచ‌రీల‌తో చెల‌రేగారు. వారిద్ద‌రితో పాటు ముష్ఫికర్ రహీం(40), మోనిమ‌ల్‌(33), ష‌కీబ్‌(41) రాణించారు. 

జింబాబ్వే బౌల‌ర్ల‌లో విన్సెంట్ మసెకేసా 5 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ముజారబానీ, వెల్లింగ్టన్ మసకడ్జా బెన్న‌ట్ త‌లా వికెట్ సాధించారు. ఆ త‌ర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా జింబాబ్వే ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. బంగ్లా బౌల‌ర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

బంగ్లా బౌల‌ర్ల‌లో మెహ‌దీ హ‌స‌న్ 5 వికెట్ల‌తో చెల‌రేగ‌గా.. తైజుల్ ఇస్లాం మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో బెన్ కుర్రాన్‌(46) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ విజ‌యంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో బంగ్లా స‌మం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement