సౌతాఫ్రికా టెస్ట్‌ జట్టు ప్రకటన.. సీఎస్‌కే చిచ్చరపిడుగుకు చోటు | South Africa Announce Squad For Zimbabwe Tests | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా టెస్ట్‌ జట్టు ప్రకటన.. సీఎస్‌కే చిచ్చరపిడుగుకు చోటు

Jun 6 2025 7:03 PM | Updated on Jun 6 2025 7:51 PM

South Africa Announce Squad For Zimbabwe Tests

ఈ నెలాఖరులో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (జూన్‌ 6) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపిక కాగా.. ఐదు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటు దక్కింది. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో ఇరగదీసిన సీఎస్‌కే చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ తొలిసారి టెస్ట్‌ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. 

అతనితో పాటు మరో విధ్వంసకర బ్యాటర్‌ లుహాన్‌-డ్రి-ప్రిటోరియస్‌ కూడా టెస్ట్‌ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. జింబాబ్వే సిరీస్‌లో బ్రెవిస్‌, ప్రిటోరియస్‌ సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌గా ఉంటారు. భారీ హిట్టర్లుగా పేరున్న వీరు టెస్ట్‌ ఫార్మాట్‌లో ఏమేరకు రాణిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల జాబితాలో బ్రెవిస్‌, ప్రిటోరియస్‌తో పాటు లెసెగొ సెనొక్వానే (బ్యాటర్‌), కోడి యూసఫ్‌ (ఫాస్ట్‌ బౌలర్‌), ప్రెనెలన్ సుబ్రాయన్‌ (ఆఫ్‌ స్పిన్నర్‌) ఉన్నారు. స్పిన్నర్‌ జుబేర్‌ హంజా ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న జట్టులోని ఎనిమిది మందికి (బవుమా, బెడింగ్హమ్‌, కార్బిన్‌ బాష్‌, జోర్జి, కేశవ్‌ మహారాజ్‌, ముల్దర్‌, ఎంగిడి, వెర్రిన్‌) మాత్రమే ఈ జట్టులో చోటు దక్కింది. జన్సెన్‌, రబాడ, మార్క్రమ్‌, రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌కు విశ్రాంతి కల్పించారు. 

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్‌ జూన్‌ 11 నుంచి 15 వరకు లార్డ్స్‌ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ  మ్యాచ్‌ కోసం సౌతాఫ్రికా జట్టు ఇదివరకే లండన్‌కు చేరుకుంది.

జింబాబ్వేతో సిరీస్‌ షెడ్యూల్‌.. 
తొలి టెస్ట్‌-జూన్‌ 28-జులై 2 (బులవాయో)
రెండో టెస్ట్‌-జులై 6-10 (బులవాయో)

జింబాబ్వే సిరీస్‌కు దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: టెంబా బవుమా (కెప్టెన్‌), డేవిడ్ బెడింగ్హమ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్‌-డ్రి-ప్రిటోరియస్‌, ప్రీటోరియస్, లెసెగొ సెనొక్వానే, ప్రెనెలన్ సుబ్రాయన్‌, కైల్ వెర్రిన్‌, కోడి యూసుఫ్.
 

Advertisement
 
Advertisement
Advertisement