
భారత్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే 2026 టీ20 ప్రపంచకప్‌కు (T20 World Cup 2026) జింబాబ్వే (Zimbabwe) అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్స్ 2025లో ఫైనల్‌కు చేరడం ద్వారా ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది.
జింబాబ్వేతో పాటు నమీబియా (Namibia) కూడా ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్స్‌లో ఫైనల్‌కు చేరి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. ఉగాండ చేతిలో ఓటమి కారణంగా జింబాబ్వే గత ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.
Here are the qualified teams for the T20 World Cup 2026 so far.🏏
Namibia booked their spot in the 2026 T20 World Cup with a semi-final win in Harare, while Zimbabwe joined them after defeating Kenya.#T20WorldCup2026 pic.twitter.com/lOnoV1S9JD— CricTracker (@Cricketracker) October 2, 2025
జింబాబ్వే, నమీబియా బెర్త్‌లు ఖరారు చేసుకోవడంతో ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 17కి చేరింది. ఇంకా మూడు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. ఆ మూడు జట్లు ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా ఖరారవుతాయి.
ఇప్పటిదాకా భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.
ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో నిన్న (అక్టోబర్ 2) జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌ల్లో నమీబియా టాంజానియాపై, జింబాబ్వే కెన్యాపై విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరాయి. రేపు జరుగబోయే ఫైనల్లో కెన్యా, నమీబియా ఆఫ్రికా క్వాలిఫయర్ ఛాంపియన్‌షిప్ కోసం పోటీపడతాయి.