అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసకర శతకం | Rahul Dravid Son Anvay 100 Ball 151 Karnataka Beat Gujarat | Sakshi
Sakshi News home page

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసకర శతకం.. భారీ టార్గెట్‌ ఉఫ్‌!

Oct 16 2026 8:05 PM | Updated on Oct 16 2026 8:18 PM

Rahul Dravid Son Anvay 100 Ball 151 Karnataka Beat Gujarat

భారత జెర్సీలో అన్వయ్‌ (ఫైల్‌ ఫొటో PC: BCCI)

భారత అండర్‌ 19 వన్డే టోర్నమెంట్‌ వినూ మన్కడ్‌ ట్రోఫీ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ దుమ్ములేపాడు. గుజరాత్‌ జట్టుతో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర శతకం బాదాడు. కేవలం 100 బంతుల్లోనే 151 పరుగులతో అదరగొట్టాడు.

కాగా ఈ దేశీ వన్డే టోర్నీలో అన్వయ్‌ ద్రవిడ్‌ కర్ణాటక జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా విజయనగరం వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కర్ణాటక- గుజరాత్‌ అండర్‌-19 జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది.

సమీర్‌, యశ్‌ అజేయ సెంచరీలు
టాస్‌ గెలిచిన కర్ణాటక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. గుజరాత్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 357 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఐదు, ఆరో స్థానాల్లో వచ్చిన సమీర్‌ భండారి (88 బంతుల్లో 119),  యశ్‌ పంజ్వాని (57 బంతుల్లో 106) విధ్వంసకర అజేయ శతకాలు బాదారు.

శతక్కొట్టిన ధ్రువ్‌, అన్వయ్‌
అనంతరం కర్ణాటక లక్ష్య ఛేదనకు దిగగా.. ఓపెనర్లు రోహిత్‌ రెడ్డి (26), నితీశ్‌ ఆర్య (6) విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ క్రిష్ణన్‌, కెప్టెన్ అన్వయ్‌ ద్రవిడ్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ధ్రువ్‌ 100 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 130 పరుగులు సాధించగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అన్వయ్‌ ద్రవిడ్‌ కూడా శతక్కొట్టాడు.

కేవలం 100 బంతుల్లోనే 20 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో అన్వయ్‌ 151 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో తేజస్‌ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌ (9 బంతుల్లో 21 నాటౌట్‌) ఆడాడు. ఈ క్రమంలో 45.3 ఓవర్లలో కర్ణాటక ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.

ఐదు వికెట్ల తేడాతో..
అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించగా.. VJD (వి జయదేవన్‌ మెథడ్‌) పద్ధతి ప్రకారం.. కర్ణాటక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మరో మ్యాచ్‌లో భారత విధ్వంసకర ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ పెద్ద కుమారుడు, ఢిల్లీ కెప్టెన్‌ ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ కూడా శతక్కొట్టాడు. చండీగఢ్‌తో మ్యాచ్‌లో కేవలం 143 బంతుల్లోనే 173 పరుగులు సాధించాడు.

ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఢిల్లీ ఆరు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో చండీగఢ్‌ కేవలం 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. 

ఇదీ చదవండి: IND vs WI: విండీస్‌తో ఐదో టీ20.. భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement