వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ మరోసారి అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇటీవలే భారత అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియాతో అనధికారిక వన్డే సిరీస్లో దూకుడు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 143 బంతుల్లోనే 173 పరుగులు తాజాగా భారత అండర్ 19 వన్డే టోర్నమెంట్ వినోద్ మన్కడ్ ట్రోఫీ మ్యాచ్లోనూ ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొట్టాడు. ఢిల్లీ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న అతడు.. చండీగఢ్తో మ్యాచ్లో పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్ తరహాలో చెలరేగుతూ 143 బంతుల్లోనే 173 పరుగులు సాధించాడు.19 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లుఓపెనింగ్ బ్యాటర్ ఆర్యవీర్ సెహ్వాగ్ ఇన్నింగ్స్లో ఏకంగా 19 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం. అతడికి తోడు మరో ఓపెనర్ ఆర్నవ్ బగ్గా (47) రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేయగలిగింది.PC: BCCI Domesticగత మ్యాచ్లో విఫలంకాగా 18 ఏళ్ల ఆర్యవీర్ సెహ్వాగ్.. 16 మంది సభ్యులతో కూడిన ఢిల్లీ జట్టుకు సారథిగ ఎంపికయ్యాడు. విశాఖపట్నం వేదికగా అక్టోబరు 8న మొదలైన వినోద్ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ జట్టు చివరగా.. కర్ణాటక జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు తేలిపోగా.. కర్ణాటక 418 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనలో ఆర్యవీర్ (32)తో పాటు జట్టు మొత్తం తేలిపోవడంతో ఢిల్లీ కేవలం 220 పరుగులకే ఆలౌట్ అయి.. భారీ ఓటమిని మూటగట్టుకుంది. డబుల్ సెంచరీ మిస్అయితే, తాజాగా చండీగఢ్తో శుక్రవారం నాటి మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన ఆర్యవీర్ సెహ్వాగ్ ధనాధన్ దంచికొట్టడం విశేషం. అయితే, డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మాత్రం కోల్పోయాడు. చండీగఢ్ బౌలర్ శ్రేష్ట్ దుగ్గల్ బౌలింగ్లో కశ్యప్నకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.చదవండి: ‘రోహిత్ చెప్పేశాడు.. అందుకే నాకు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు’