భువీ- అర్ష్ (PC: BCCI)
వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20 సందర్భంగా గాయపడ్డ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఆఖరి టీ20కి అందుబాటులో ఉండే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది.
భుజానికి గాయమైన కారణంగా అర్ష్ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందన్న యాజమాన్యం.. ముందు జాగ్రత్తగా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఐదో టీ20కి ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ముందుగానే రీఎంట్రీ
కాగా నాలుగేళ్ల తర్వాత భువీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ ఈ యూపీ బౌలర్‌కు చోటు ఇచ్చింది. అయితే, తాజాగా అర్ష్‌దీప్ గాయం వల్ల ముందుగానే భువీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున గత రెండు సీజన్లలో అదరగొట్టిన భువీ.. జట్టు వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 36 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్.. ఎట్టకేలకు పునరాగమనం చేయాలన్న కోరికను నెరవేర్చుకుంటున్నాడు.
ఆర్సీబీ సొంత మైదానంలో
ఇక విండీస్‌తో ఆఖరిదైన నిర్ణయాత్మక ఐదో టీ20కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక. ఇది ఆర్సీబీ సొంత మైదానం.. ఇక్కడ భువీ గత రెండేళ్లుగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో ఐదో టీ20లో భువీ తుదిజట్టులోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది.
మరోవైపు.. హైదరాబాద్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్.. షమార్ జోసెఫ్ బౌలింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఐదో టీ20 ఆడే విషయంలో సందిగ్దం నెలకొనగా.. భువీకి సువర్ణావకాశం దక్కింది. అర్ష్‌ను కొనసాగిస్తూనే.. భువీకి కూడా బీసీసీఐ అవకాశం ఇవ్వడం విశేషం. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్- విండీస్ 2-2తో సమంగా ఉన్నాయి.
వెస్టిండీస్‌తో ఐదో టీ20కి భారత జట్టు (అప్డేటెడ్)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్) శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమర్ ధిర్, భువనేశ్వర్ కుమార్.
ఇవీ చదవండి: IND vs WI: నీకసలు మానవత్వం, క్రీడాస్ఫూర్తి లేవా?: అర్ష్‌దీప్ భుజానికి గాయం.. టీమిండియా దిగ్గజం ఫైర్
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!


