టీమిండియాను చిత్తు చేసిన న్యూజిలాండ్‌ | India Lose Final T20I By 7 Wickets As Seifert's 93 Outshines Half-Centuries By Ishan Kishan And Shreyas Iyer, Read Full Story | Sakshi
Sakshi News home page

IND vs NZ: సీఫెర్ట్‌, ఫిలిప్స్ మెరుపులు.. టీమిండియాను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Nov 1 2026 4:13 PM | Updated on Nov 1 2026 4:56 PM

India Suffer 7-Wicket Defeat in Hamilton as Seiferts Blistering 93 Seals the Final t20

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఓటమితో ముగించింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20లో  కివీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 

భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50), వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (61) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో పేసర్ ఆడమ్ మిల్నే 4 వికెట్లు పడగొట్టగా..  నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నెర్ తలా 2 వికెట్లు సాధించారు.

సీఫెర్ట్, ఫిలిప్స్ విధ్వంసం
అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది.      కివీస్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే డేంజరస్ బ్యాటర్ ఫిన్ అలెన్‌ను అర్ష్‌దీప్ అద్భుతమైన బంతితో కోల్తా కొట్టించాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ బౌలింగ్‌లోనే మరో కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను జారవిడిచింది. ఇందుకు భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.

13 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సీఫెర్ట్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 50 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 93 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్‌ నుంచి లాగేసుకున్నాడు. అతడితో పాటు గ్లెన్‌ ఫిలిప్స్‌(38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వరుణ్‌ చక్రవర్తి తలా వికెట్‌ సాధించారు. అయితే తొలి మూడు టీ20ల్లో భారత్ విజయం సాధించడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement