తెలుగులో యాంకర్ అని పేరు చెప్పగానే చాలామందికి సుమనే గుర్తొస్తుంది. గత కొన్నేళ్లుగా టీవీ, సినిమా ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. అలానే గత ఐదేళ్ల నుంచి 'ఫెస్టివల్స్ ఫర్ జాయ్' పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పండగలు చేసుకోలేని వాళ్లకు సుమ తనవంతు ఆర్థిక సాయం చేస్తూ ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో మాట్లాడిన సుమ భర్త రాజీవ్ కనకాల ఎమోషనల్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)
'సుమ జర్నీ మామూలు జర్నీ కాదు. తను ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉండటానికి కారణం చాలా దృఢ నిశ్చయం, సంకల్పంతో ఉండి.. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్లడానికి కారణం నాలాంటోడిని భరించడమే. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది వెనక మేము ఉన్నా గానీ మేమేం సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఆమెని ఆమెనే సపోర్ట్ చేసుకోవడంతో పాటు మమ్మల్ని కూడా చేసింది. చుట్టూ ఉన్నవాళ్లని కూడా సపోర్ట్ చేయగలదని ఈ కార్యక్రమంతో నిరూపించింది. మామూలుగా ఎక్కడో ఇంటర్వ్యూలో చెబుతుంటా.. లాంగ్ లివ్(కలకాలం బతుకు). 116 గ్యారంటీ' అని రాజీవ్ మాట్లాడుతుంటే సుమ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఇల్లు కట్టిన కమెడియన్.. వీడియో వైరల్)


