తన్నుకున్నంత పనిచేసిన వంశీ, రోహిత్.. నామినేషన్స్‌లో ఎవరెవరంటే? | Bigg Boss Season 10 Telugu nominations on second day | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: తన్నుకున్నంత పనిచేసిన వంశీ, రోహిత్.. నామినేషన్స్‌లో ఎవరెవరంటే?

Oct 14 2026 7:12 AM | Updated on Oct 14 2026 7:17 AM

Bigg Boss Season 10 Telugu nominations on second day

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10 ఆరో వారానికి చేరుకుంది. గతవారంలో డబుల్ ఎలిమినేషన్‌ కాగా.. వైల్డ్ ఫైర్ అంటూ ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఈ సోమవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు కొందరు నామినేట్ కాగా.. రెండో రోజు నామినేషన్స్‌లో హౌస్‌ హీటెక్కిపోయింది. ఒకరిపై ఒకరు కారణాలు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. రోహిత్‌, శివకుమార్‌కు మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది.

ఇప్పటికే నామినేషన్స్‌లో ఝాన్సీ, వంశీ, అమన్, వర్షిణి  ఉన్నారు. రెండో రోజు రామ్ ప్రసాద్, షాలిని కూడా నామినేట్ ‍అయ్యారు. రామ్ ప్రసాద్‌ను ముకేశ్ నామినేట్ చేయగా.. షాలినిని దెబ్జానీ నామినేట్ చేశారు. షాలినిని వంశీ కూడా టార్గెట్‌ చేశారు. ఆమెతో చాలాసేపు వాదించారు. ఆ తర్వాత రోహిత్‌ను త్రిగుణ్ నామినేట్ చేశారు. నామినేషన్స్‌ టైమ్‌లో రోహిత్‌, త్రిగుణ్‌కు మధ్య మాటల యుద్ధం నడిచింది. రోహిత్‌ను ఉద్దేశించిన నీది రొట్ట గ్యాంగ్‌ అంటూ త్రిగుణ్ రెచ్చిపోయాడు.

ఆ తర్వాత రోహిత్‌కు.. వంశీకి పెద్ద గొడవే జరిగింది. ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లారు. అలా ఈ వారంలో ఝాన్సీ, వంశీ, అమన్, వర్షిణి, రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముకేశ్, రోహిత్ నామినేషన్స్‌లో నిలిచారు. నామినేషన్స్ ప్రక్రియ ముగియగానే కంటెస్టెంట్స్‌కు టాస్క్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్. దశవాతారంలో భాగంగా రోడ్ బ్లాక్‌ గేమ్‌లో ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్‌ తలపడ్డారు. ఈ టాస్క్‌లో నరేశ్, రోహిత్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో చరణ్ టాపిక్‌ తీసుకొచ్చారు. నీ గేమ్ చాలా వీక్‌ ఉందని రోహిత్‌కు ఇచ్చిపడేశాడు నరేశ్. అలా ఈ ఎపిసోడ్ ముగిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement