ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ నడుస్తోంది. అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదో వారంలోకి వచ్చేసింది. గతవారంలో సృష్టి ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగా.. దేబ్జానీ, వంశీ, సుధీర్, వర్షిణి, అపూర్వ, రోహిత్, ముకేశ్, త్రిగుణ్, చరణ్, అమన్, శాలిని, రాంప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. లోడ్ టూ రీలోడ్ టాస్క్‌లో భాగంగా ఓ గేమ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో అపూర్వ, వంశీకి మధ్య మాటల యుద్ధం నడించింది. ఇలా కొట్టేసి పైనుంచి బాల్ పోతే పోయినట్టేనా అని వంశీ.. అపూర్వను ప్రశ్నించాడు. దీంతో వీరిద్దరి మాటల యుద్ధం చిన్నపాటి రణరంగాన్ని తలపించింది. నోరు ఉందని గట్టిగా అరవకు అంటూ అపూర్వ వైపు వేలు చూపించాడు వంశీ. అలా ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో ఈ ప్రోమో ముగిసింది. ఈ రోజు ఎపిసోడ్‌లో అసలేం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి షో చూడాల్సిందే.


