నామినేషన్స్‌తో మొదలైన రచ్చ.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లే..! | Bigg Boss Show Monday Nominated contestants in season 10 | Sakshi
Sakshi News home page

Bigg Boss: నామినేషన్స్‌తో మొదలైన రచ్చ.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లే..!

Oct 13 2026 7:07 AM | Updated on Oct 13 2026 7:08 AM

Bigg Boss Show Monday Nominated contestants in season 10

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10 మరింత రసవత్తరంగా మారింది. అప్పుడే ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగుపెట్టేసింది. ఈ వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్‌ కాగా.. వైల్డ్ ఫైర్ అంటూ ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకొచ్చారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇక సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్ల పర్వం మొదలవుతుంది.

ఇక సోమవావం యథావిధిగా నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు ఎప్పటి మాదిరిగానే మాటల యుధ్దం ప్రారంభించారు. దశావతారంలో భాగంగా ఈ వారం రోడ్ బ్లాక్ అంటూ బిగ్‌బాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్ ప్రక్రియలో పోరాడే ఇద్దరు ఇంటి సభ్యులను వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్ ఎంపిక చేస్తారని బిగ్‌బాస్ చెప్పారు. అలా శివకుమార్.. రోహిత్, త్రిగుణ్‌ను ఎంపిక చేయగా.. ఆ పోటీలో రోహిత్ గెలిచి నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు. ఆ తర్వాత టెంపర్ వంశీ.. ఝాన్సీని నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వంశీ, రోహిత్ మధ్య భారీగానే మాటల యుద్ధం జరిగింది. చివరకు వంశీ నామినేట్ అయ్యారు.

ఆ తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ నీతూ నటరాజ్ నామినేషన్స్ కోసం అమన్, ముఖేశ్‌ను ఎంపిక చేశారు. ఈ పోటీలో ముఖేష్ గెలవడంతో నామినేట్ చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఈ సందర్భంగా అమన్, ముఖేశ్ మధ్య గొడవతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా అమన్.. షాలినిని నామినేట్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ నామినేషన్ సందర్భంగా అమన్, త్రిగుణ్, ముఖేశ్ పెద్ద గొడవ జరిగింది. ఈ ప్రక్రియలో అమన్‌ నామినేట్ అయ్యారు. ఆ తర్వాత వర్షిణి సౌందర్యరాజన్ కూడా నామినేట్ అయ్యారు. ‍అలా తొలిరోజు నామినేషన్స్ ప్రక్రియలో ఝాన్సీ, వంశీ, అమన్, వర్షిణి నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి ఎన్ని వివాదాలు చోటు చేసుకొంటాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement