‘ఆ హత్యకేసులో బోండా ఉమ ప్రమేయం ఉంది’

Koganti Satyam Respond On Businessman Ram Prasad Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ హత్యకేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు. శనివారం పంజాగుట్టలో రాంప్రసాద్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి హత్యచేసి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై కోగంటి సత్యంకు సంబంధం ఉందని అందుకే అజ్ఞాతంలోకి వెళ్లారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను కావాలనే ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాంప్రసాద్‌ నుంచి తనకు 26 కోట్లు రావాలని, అలాంటప్పుడు తానేలా హత్యచేస్తానని ప్రశ్నించారు.

నాపై కక్ష్యపూరితంగానే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ హత్యకేసులో బోండా ఉమా, ఏబీ వెంకటేశ్వరరావు ప్రమేయం ఉందని అన్నారు. గతంలో కూడా ఏబీ వెంకటేశ్వర రావుతో కలిసి బోండా ఉమా తనపై తప్పుడు కేసులు బనాయించారని గుర్తు చేశారు. తానేమీ అజ్ఞాతంలో లేనని, ఫిజియోథెరపీ కోసం హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top