జబర్దస్త్ రాంప్రసాద్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. ఆసక్తిగా ట్రైలర్ | Jabardasth Ram Prasad Latest Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

జబర్దస్త్ రాంప్రసాద్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. ఆసక్తిగా ట్రైలర్

Published Sun, Mar 2 2025 9:21 PM | Last Updated on Sun, Mar 2 2025 9:21 PM

Jabardasth Ram Prasad Latest Movie Trailer Out Now

జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'వైఫ్‌ ఆఫ్ ఆనిర్వేశ్'. ఈ సినిమా గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ నటుడు శివాజీ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటే  రాంప్రసాద్ విభిన్నమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో సన్నివేశాలు చూస్తే కామెడీకి భిన్నంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. ఈ సందర్భంగా సినిమా మంచి హిట్ అవుతుందని టీమ్‌కు శివాజీ అభినందనలు తెలిపారు. నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపారు.   మార్చి 7వ తేదీ ఈ చిత్రం రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ..' జబర్దస్త్ రాంప్రసాద్‌తో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం మా చిత్రబృందమే. మ్యూజిక్ డైరెక్టర్ షణ్ముఖ, మా చిత్రంలో నటించిన తారాగణం ఎంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement