W/O అనిర్వేశ్ మూవీ రివ్యూ | W/O Anirvesh Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా నటించిన ‘W/O అనిర్వేశ్’ ఎలా ఉందంటే..

Published Sat, Mar 8 2025 10:32 AM | Last Updated on Sat, Mar 8 2025 10:56 AM

W/O Anirvesh Movie Review In Telugu

జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి  కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ W/O అనిర్వేశ్’. ‘ది డెవిల్‌ చైర్‌’ఫేం గంగ సప్తశిఖర  దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై  మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మించారు. మార్చి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
ప్రైవేట్‌ ఉద్యోగి అనిర్వేశ్‌(జబర్దస్త్ రామ్ ప్రసాద్) తన భార్య విచెలిత(సాయి ప్రసన్న) తనను నిత్యం వేధిస్తోందని సి.ఐ వరదరాజులు(జెమిని సురేష్)కి ఫిర్యాదు చేస్తాడు. మరో వైపు అనిర్వేశే నిత్యం తనను వేధిస్తూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడని,  తనకు చావే శరణ్యమని సీఐ వరదరాజులకు ఫోన్లో తన ఆవేధను అంతా వెలిబుచ్చుతుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న యువకుడు రాబర్ట్‌(సాయి కిరణ్‌ కోనేరి).. అనిర్వేశ్‌, విచెలిత కలిసి తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ, లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తాడు.కట్‌ చేస్తే..బిజినెస్‌ మ్యాన్‌ ధనుర్భాక్షి(కిరిటీ) ఓ వేశ్యతో సన్నిహితంగా ఉంటూ.. ఆమెను లోబరుచుకొని దారుణంగా హత్య చేస్తాడు. ఈ కేసు విచారణలో సి.ఐ వరదరాజులు బిజీ అయిపోతాడు. అనిర్వేశ్‌ కేసు విచారణకు మరో పోలీసు ఆఫీసర్(కిశోర్ రెడ్డి)ను నియమిస్తాడు. మరి రెండు కేసుల విచారణలో తేలిన నిజాలు ఏంటి? అనిర్వేశ్‌, విచెలిత, రాబర్ట్‌లలో ఎవరు ఎవరిని వేధించారు? మైథిలీ ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఈ కేసుతో రౌడీ షీటర్‌ ఆది, డాక్టర్‌ శరణ్య, సీఐ వరదరాజులుకు ఉన్న సంబంధం ఏంటి? మిమిక్రీ ఆర్టిస్ట్‌ రామకృష్ణతో ఈ కేసులకు ఉన్న సంబంధం ఏటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్లాట్ ను ఎంచుకుని... గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులభంగా విజయం సాధిస్తాయనే నమ్మకం ఉండటమే ఇందుకు కారణం.  W/O అనిర్వేశ్ కూడా ఆ జానర్‌ కథే. మర్డర్ మిస్టరీ ప్లాట్ కి... కాస్త అడల్ట్ డ్రామా కంటెంట్ ను జోడించి యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు గంగ సప్తశిఖర.

భార్య వేధిస్తోందంటూ భర్త... భర్త వేధిస్తున్నాడంటూ భార్య... వీరిద్దరూ తోడుదొంగలు... నన్ను పార్టీ పేరుతో ఇంటికి పిలిచి... నేను, నా ప్రేయసి ఏకాంతంగా ఉన్న సన్నివేశాలను వీడియో తీసి బెదిరిస్తున్నారంటూ... మరో వ్యక్తి ఫిర్యాదు.. ఇలా ట్రయాంగిల్ లో జరిగే స్టోరీకి అడల్ట్ కంటెంట్ ను కాస్త జోడించి... సినిమాను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవ్వకుండా చూసేలా తెరకెక్కించా. ఇది యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రామ్ ప్రసాద్, సాయి ప్రసన్నల మధ్య వచ్చే ఎపిసోడ్స్ రామ్ ప్రసాద్ లోని మరో కోణాన్ని భయట పెడతాయి. 

ఇక ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్స్ కొన్ని మరీ బోల్డ్ గా వున్నాయి. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు కథ రివీల్ అవుతుంది. వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధం... అలాగే సి.ఐ.వరదరాజులు అసలు పాత్ర ఏమిటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో... ఈ చిత్రం అసలు సిసలైన సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ అనిపించుకుంటుంది. దర్శకుడు ఎక్కడా పాత్రలపై అనుమానం రాకుండా... చివరిదాకా అసలు విషయంలో సస్పెన్స్ ను చివరి దాకా క్యారీ చేయడం నిజంగా దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది.  క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి ఇది నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..
ఇప్పటి వరకు కామెడీతోనే అలరించిన జబర్దస్త్ రామ్ ప్రసాద్... ఇలాంటి క్రైం బేస్డ్ సినిమాలో నటించి తనలోని మరో సీరియస్ కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. అనుమానపు మొగుడిగా శాడిస్ట్ పాత్రలో బాగా ఒదిగిపోయి నటించారు రామ్ ప్రసాద్. అలాగే ఇంటర్వెల్ తరువాత వచ్చే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లోనూ బాగా వేరియేషన్ చూపించారు. అతనికి జంటగా నటించిన సాయి ప్రసన్న కొన్ని బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక నజియా ఖాన్ హోమ్లీ గాళ్ గా చాలా క్యూట్ గా కనిపించి మెప్పించింది. కిరీటి క్యారెక్టర్ కూడా చివరి దాకా బ్యాగా క్యారీ అయింది.రాబర్ట్ పాత్రలో సాయి కిరణ్ కోనేరి ఆకట్టుకున్నాడు. సీఐ పాత్రలో జెమిని సురేష్ చివరి దాకా కనిపించి ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా ఉంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement