Auto Ram Prasad Comments On Anchor Rashmi Gautam - Sakshi
Sakshi News home page

Anchor Rashmi Gautam: యాంకర్‌ రష్మీపై వల్గర్‌ కామెంట్‌ చేసిన కమెడియన్‌.. నాడు విష్ణుప్రియపై కూడా..!

Jul 25 2023 10:07 AM | Updated on Jul 25 2023 11:14 AM

Auto Ram Prasad Comments On Anchor Rashmi Gautam - Sakshi

బుల్లితెరపై యాంకర్‌ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్‌ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది.  హీరోయిన్‌గా స్థిరపడాలనే ఆశతో వచ్చిన రష్మీకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బుల్లితెర యాంకర్‌గా స్థిరపడిపోయిందనే చెప్పవచ్చు. అక్కడ తను స్టార్‌ పొజీషన్‌లోనే ఉ‍న్నారు కూడా. తను సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో కూడా విపరీతమైన క్రేజ్‌ తనకు ఉంది.

(ఇదీ చదవండి: అరియానా లుక్‌పై ట్రోల్స్‌.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్‌ చేశావా అంటూ..?)

తాజాగా తను హోస్ట్‌ చేస్తున్న ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో రష్మిని   అవమానించినట్లేనని చెప్పవచ్చు . ఇదే షోలో ఇప్పటి వరకు డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్న హైపర్ ఆదికి తోడుగా తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా వచ్చి చేరాడు. తన స్కిట్‌లో భాగంగా రష్మిని ఏకంగా 'రాత్రికి వస్తావా' అంటూ డబల్ మీనింగ్‌ అర్థం వచ్చేలా చిల్లర డైలాగ్‌ వేశాడు. దీంతో రష్మీ కూడా నన్ను ఎందుకు రమ్మంటున్నావు అంటూ సమాధానం ఇస్తుంది. రాత్రికి ఎందుకు రమంటారో తెలియదా..? అంటూ ఆటో రాంప్రసాద్ తిరిగి అంటాడు. అప్పుడు రష్మితో సహా సెట్‌లోని అందరు కూడా షాక్‌ అయ్యారు.

దీంతో అక్కడే ఉన్న ఇంద్రజ కలుగజేసుకుని  ఏయ్... అనేసరికి వెంటనే తేరుకున్న ఆటో రాంప్రసాద్ 'ఊరిలో జాతర ఉంది అందుకే పిలిచానంటూ' మరో డైలాగ్‌తో కవర్ చేస్తాడు. ఇలాంటి కవరింగ్‌లు ఆ ప్రోగ్రామ్‌లలో సర్వసాధారణమైనా మరీ ఇంతలా దిగజారిన చిల్లర డైలాగ్‌లు ఉంటే ఎలా అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్‌ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే)

గతంలో ఇలాంటి ప్రోగ్రామ్‌లలోనే  విష్ణుప్రియ ముక్కు మీద వేసిన పంచులు, తనను బాడీ షేమింగ్‌ చేస్తూ వేసిన జోకులు ఎన్నో అని చెప్పవచ్చు. నిజానికి ఆమె ముక్కు మీద ఓ వేయిసార్లు జోకులు వేసి ఉంటారేమో. ఆమెపైనే కాదు.. ఇమ్మూ కలర్ మీద, రష్మి మేకప్ మీద కూడా స్కిట్‌ల పేరుతో బోలెడు కామెంట్లు చేసేవారు. వాటిని సోషల్‌మీడియాలో నెటిజన్లు కూడా చాలాసార్లు తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎదో రకంగా వచ్చిన అవకాశాలను పోగొట్టుకోకూడదని ఈ ప్రోగ్రామ్స్‌లోని నటులు కూడా వాటిని భరిస్తూనే ఉంటారని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement