Netizens Trolls On Ariyana Glory Latest Photos In Her Instagram, Deets Inside - Sakshi
Sakshi News home page

Trolls On Ariyana Glory: అరియానాపై దారుణమైన ట్రోల్స్‌.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్‌ చేశావా అంటూ..?

Jul 25 2023 8:23 AM | Updated on Oct 9 2023 3:03 PM

Netizens Comments On Ariyana Glory Photos In Instagram Latest - Sakshi

బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలతో ఎప్పుడూ షేర్‌ చేస్తూ..  సోషల్​ మీడియాను షేక్​ చేస్తోంది. తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ట్రాక్ చేంజ్ చేసి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ లేడీ. దీంతో ఎప్పుడూ ఆడియన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో మరింత పాపులర్‌ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అరియానా  సొంతం చేసుకుంది.

(ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్‌ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే)

బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక పలు ఎంటర్‌టైన్​మెంట్ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్‌తో పాటు సెలబ్రిటీల ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటీ సొంతం చేసుకుంది. మరోవైపు వెబ్ సిరీసుల్లో కూడా భాగమవుతూనే..  బీబీ జోడీ ప్రోగ్రామ్‌తో  అరియానా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.  సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తుంటుంది. తాజాగా అరియానా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె అస్సలు గుర్తుపట్టలేని విధంగా కనిపించడంతో.. అభిమానులు షాక్ అయ్యారు. ఆ ఫోటోల్లో ఉండేది నిజంగానే అరియానానేనా..  అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నట్లు ఫోటోలను షేర్‌ చేసింది.

(ఇదీ చదవండి: ధోని ఎంట్రీ ఖాయం ..ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త)

అరియానా తాజా లుక్‌లో కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. డబుల్ చిన్‌తో ఏ మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో అభిమానులతో పాటు కొందరు నెటిజన్లు అరియానాపై ఇలా కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్స్‌ అన్నీ పక్కన పెట్టేసి బాగా తిని నిద్రపోతున్నావా..? మరీ బొద్దుగా అయ్యావ్‌ అంటూనే గతంలో మాదిరే సన్నగా ఉంటేనే బాగుంటావ్‌  అని కామెంట్ల ద్వారా తెలుపుతున్నారు. ఇలా అయితే ఇండస్ట్రీలో ఎలా అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఏదైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నావా? అంటున్నారు. షూటింగ్‌లకు గుడ్‌బై చెప్పి పెళ్లి కార్యక్రమం ఏమైనా ప్లాన్‌ చేశావా? ఏంటి అని మరికొందరు అంటున్నా... సాధ్యమైనంత త్వరగా మళ్లీ సన్నగా అ‍వ్వండని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇలా ఎవరికి తోచింది వారు కామెంట్ల చేస్తున్నారు.  ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


 


 

Advertisement
 
Advertisement
Advertisement