రాంప్రసాద్‌ హత్య కేసులో సంచలన నిజాలు

New twist In Industrialist Ram Prasad Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్ : క్రైమ్‌ సస్సెన్స్‌ థ్రిల్లర్‌ని తలపిస్తున్న పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్‌ హత్య కేసును హైదరాబాద్‌ ట్రాన్స్‌ఫోర్స్‌ పోలీసులు చేధించారు. విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యాపారవేత్త ఈ హత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మర్డర్‌లో మొత్తం 8 మంది హస్తం ఉందని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి రాంప్రసాద్‌పై దాడి జరిగినప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సత్యంను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. సంచలన విషయాలను రాబట్టారు.

(చదవండి : హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్త హత్య )

ఆరు నెలల ముందే రాంప్రసాద్‌ హత్యకు కోగంటి సత్యం స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల ముందే కోగంటి అనుచరుడు పంజాగుట్టలో ఓ గదిని రెంట్‌కు తీసుకున్నాడు. పక్కా ప్లాన్‌తో  కోగంటి సత్యం డైరెక్షన్‌లోనే హత్య జరిగింది. తన పాత్రను బయటపెట్టకుండా కోగంటి జాగ్రత్త పడ్డాడు. రాంప్రసాద్‌ హత్యకు కోగంటి రూ.30 లక్షలు సుపారి ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కోగంటి వాడిన 5 సెల్‌ ఫోన్‌లను  పోలీసులు సీజ్‌ చేశారు. నిందితులు వాడిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. అదుపులో ఉన్న వ్యక్తుల ఇచ్చిన వివరాల ఆధారంగా వాహనం, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్  స్టీల్ వ్యాపారి బన్సల్ , హైదరాబాద్ కు చెందిన సియోట్ కంపెనీ ఓనర్లతో పాటు మరొకొంత మంది అనుమానితులను కూడా పోలీసులు విచారించనున్నారు.

(చదవండి : టాస్క్‌ఫోర్స్‌ అదుపులో కోగంటి సత్యం)

కాగా రాంప్రసాద్ ను హత్య చేసింది తానే అంటూ నిందితుడు శ్యామ్ మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే ఈ హత్యకు కోగంటికి సంబంధం ఎలాంటి సంబంధంలేదని చెప్పాడు. రాంప్రసాద్‌ వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఆయన నుంచి తనకు రూ.15 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నాడు. దీంతోపాటు రాంప్రసాద్‌ వద్ద కేసులు ఎదుర్కొంటూ అన్ని విధాలుగా నష్టపోయానన్నాడు. ఆ సందర్భంలో తనను కలిసిన రాంప్రసాద్‌ బావమరిది ఊర శ్రీనివాస్‌ సుపారీ ఇచ్చాడని, రాంప్రసాద్‌ను హత్య చేస్తే రూ.30 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు. దీంతో తన అనుచరులైన ఛోటు, రమేష్‌లతో కలిసి రాంప్రసాద్‌ను హత్య చేశానని పేర్కొన్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top