Auto Ram Prasad Movie Teaser: హీరోగా ఆటో రాంప్రసాద్‌, హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Auto Ram Prasad Peep Show Movie Teaser Out Now - Sakshi

సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణ... యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో అమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం "పీప్ షో". దొంగచాటుగా తొంగిచూడడాన్ని "పీప్ షో" అంటారన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు.

జబర్దస్త్ సూపర్ స్టార్స్‌లో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తున్న "పీప్ షో" చిత్రానికి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాతలు టి.వి.ఎన్.రాజేష్, ఎస్.ఆర్.కుమార్ తెలిపారు. తన చిరకాల మిత్రుడు క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పీప్ షో" చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు సంగీత దర్శకుడు రంజిన్ రాజ్. "పీప్ షో" చిత్రం దర్శకుడిగా తన మిత్రుడు క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని హీరో రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.

చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్‌ టూ సేమ్‌..
 లండన్‌లో సీక్రెట్‌గా బాలీవుడ్‌ ‍హీరో పెళ్లి..!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top