అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్‌ టూ సేమ్‌.. | Sakshi
Sakshi News home page

Pooja Hegde: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్‌ టూ సేమ్‌..

Published Thu, Jul 14 2022 9:34 AM

Is Ileana D Cruz Faith Follows to Pooja Hegde In Kollywood - Sakshi

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలిగి పోతున్న నటి పూజా హెగ్డే. చిన్న గ్యాప్‌ దొరికినా విహారయాత్రకు బయలుదేతుంది. తాజాగా మూడు ఖండాలు.. నాలుగు నగరాలు.. ఒక నెల అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది ఈ భామ. ముంబయి నుంచి బ్యాంకాక్‌ వెళ్లే విమానం ఎక్కుతున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇక సౌత్‌లో అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేస్తున్న ఈ ఉత్తరాది భామ. 

చదవండి: శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్‌

తాజాగా ఆమె బాలీవుడ్‌లోనూ సల్మాన్‌ ఖాన్, రణవీర్‌సింగ్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టి మరోసారి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం సరైన విజయం దక్కలేదు. నిజానికి పూజా తమిళ చిత్రంతోనే సినీరంగ ప్రవేశం చేసింది. 10 ఏళ్ల క్రితం ముగముడి చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో పూజా హెగ్డేను అక్కడ పట్టించుకోలేదు. చాలా గ్యాప్‌ తరువాత ఇటీవల బీస్ట్‌ చిత్రంలో విజయ్‌తో నటించినా లక్‌ కలిసి రాలేదు.

చదవండి: కాజల్‌ రీఎంట్రీ.. ఇండియన్‌ 2తో వస్తుందా?

ఇంతకు ముందు నటి ఇలియానా పరిస్థితి ఇదే. కేడీ చిత్రంతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్ర అపజయంతో ఆ తరువాత ఆమెను పక్కన పెట్టేశారు. టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న తరువాత విజయ్‌ సరసన నన్భన్‌ చిత్రంతో రీఎంట్రీ అయ్యింది. అయితే ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందడంతో ఇలియానా ఇక్కడ కనిపించలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తాజాగా సూర్య సరసన నటించే మరో లక్కీచాన్స్‌ కొట్టేసిందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రమైనా పూజాకు అవకాశాలు అందిస్తుందో లేదో చూడాలి.   

Advertisement
 
Advertisement
 
Advertisement