పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం | Road Accident At Palnadu District | Sakshi
Sakshi News home page

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

Jul 1 2026 7:17 AM | Updated on Jul 1 2026 11:47 AM

Road Accident At Palnadu District

సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. యడ్లపాడు మండలంలోని బోయపాలెం హైవేపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు.

వివరాల ప్రకారం.. బోయపాలెం హైవేపై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొన్న కారణంగానే ప్రమాదం జరిగినట్టు సమాచారం. రెండు లారీలు ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, నలుగురు మంటల్లో సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. అయితే, ఆగి ఉన్న లారీ చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్తున్నట్టు తెలిసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement