ప్రవేశాల్లో వెనుక‘బడి’ | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాల్లో వెనుక‘బడి’

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

ప్రభుత్వ పాఠశాలపై ఆసక్తి చూపని

తల్లిదండ్రులు

పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు

పంపుతున్న వైనం

దొర్నిపాడు: కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలలు చతికిల పడుతున్నాయి. నాణ్యమైన విద్యా బోధన, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ మాటలను పిల్లల తల్లిదండ్రులు నమ్మడం లేదు. దీంతో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుతున్నారు. గుండుపాపల ఎంపీపీ (మెయిన్‌), అమ్మిరెడ్డినగరంలోని ఎంపీపీ స్కూళ్లలో ఒకటవ తరగతిలో విద్యార్థులను చేర్పించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ పాఠశాలలో మొదటి తరగతిలో చేరుందుకు నలుగురు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు అందరిని ప్రైవేటు స్కూళ్లో చేర్పించారు. దీంతో మొదటి తరగతిలో చేరుందుకు ఎవరూ లేరు. దీంతో ఉపాధ్యాయులు ఎలాగోలా ఒకరిని ఒప్పించి అన్సర్‌ అనే విద్యార్థిని మొదటి తరగతిలో చేర్పించారు. అప్పటికే ఆ విద్యార్థి ఓ ప్రైవేటు స్కూల్‌లో అడ్మిషన్‌ తీసుకున్నాడు. ఇక్కడ అడ్మిషన్‌ కావాలంటే ప్రైవేటు స్కూల్లో పేరు తొలగించేందుకు కాస్త ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. అలాగే వెల్దుర్తికి చెందిన మోక్షిత్‌ను కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకోవడంతో ఆ విద్యార్థి ఒకటవ తరగతిలో చేరారు. అయితే అప్పటికే ఓ ప్రైవేట్‌ స్కూ ల్లో చేర్పించడంతో ఇక్కడ అడ్మిషన్‌ కావడం లేదు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 20 మంది విద్యార్థులు ఉన్నారు.

5 తరగతులు.. 9 మంది విద్యార్థులు

అమ్మిరెడ్డినగరంలో రోజూ పాతిక మందిని ప్రైవేటు స్కూళ్లకు పంపుతారు. కానీ ఎంపీపీ స్కూల్లో మాత్రం కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఒకటవ తరగతిలో ఇద్దరు, రెండులో ఒకరు, మూడులో నలుగురు, ఐదులో ఇద్దరు ఉన్నారు. ఇక నాల్గవ తరగతిలో ఒక్కరూ కూడా లేక పోవడం గమనార్హం. అంతేగాక గ్రామంలో ఏకోపాధ్యాయుడు మస్తాన్‌వలి విద్యను బోధిస్తున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement