అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ మృతి

Jul 6 2026 2:10 AM | Updated on Jul 6 2026 2:10 AM

కర్నూలు(హాస్పిటల్‌): అనారోగ్య కారణాలతో ఆహార నియంత్రణ విభాగం అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ కూర్మానాయకులు ఆదివారం ఉద యం మృతి చెందారు. శ్రీకాకుళానికి చెందిన ఈయన ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌గా, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌గా, డిస్ట్రిక్ట్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా కడప, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో పనిచేశారు. పదోన్నతిపై అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌గా కర్నూలు జిల్లాకు వచ్చారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా చికిత్స తీసుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చారు. ఇటీవల ఆరోగ్యం సహకరించకపోవడంతో సెలవుపై వెళ్లి వైద్యచికిత్స తీసుకుంటూ ఆదివారం మృతిచెందా రు. ఆయన మృతి పట్ల ఇన్‌చార్జ్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ రామచంద్ర, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రాజ గోపాల్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

కార్మికులను రెగ్యులర్‌ చేయాలి

కర్నూలు(సెంట్రల్‌): విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం కార్మిక, కర్షక భవన్‌లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జే.దివాకర్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరించి కనీసం వేతనం రూ.48 వేలు చేసినట్లు చెప్పారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు నాలుగు డీ ఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పోస్టులను భర్తీ చేయాలని, కింది స్థాయి సిబ్బందికి పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశా రు. యువగళం పాదయాత్ర లో నారా లోకేష్‌ ఇచ్చి న హామీలను నెరవేర్చాలని కో రుతూ జూలై 15న తిరుపతిలో ఆందోళన చేపట్టనున్న ట్లు చెప్పారు. అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 10న విజయవాడలో ఆందోళన చేస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement