ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులను ఎంపిక చేస్తూ పార్టీ అధిష్టానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కమిటీ సభ్యులుగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు), హరికట్ల శివరామిరెడ్డి (డిస్ట్రిక్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే), కో ఆర్డినేటర్‌గా పీపీ నాగిరెడ్డి (మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్)ను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
సర్వం త్యాగం చేస్తే
విస్మరించడం తగదు
నందికొట్కూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు నింపేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన తమకు న్యాయం చేయకుండా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని నీటిముంపు నిరుద్యోగుల సంఘం నాయకులు జయన్న ప్రశించారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారి పక్కన శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే దీక్ష ఆదివారం 95వ రోజుకు చేరింది. ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు న్యాయం చేసినప్పుడు తమకెందుకు న్యాయం చేయలేరన్నారు. తాము నష్టపోయి 45 ఏళ్లు దాటినా పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. దీక్షలో నారాయణ, మురళి, జమ్మన్న, నాగసుంకన్న, నాగరాజు, నాగేంద్ర తదితరులు కూర్చొన్నారు.


