పాణ్యం/ఆళ్లగడ్డ: కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఏఎస్‌ఐ చిట్టెపు సురేష్‌రెడ్డి (56) మృతిచెందా రు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ రూరల్ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న చిట్టెపు సురేష్‌రెడ్డి, అతని భార్య ఉమాదేవి, నంద్యాల టూటౌన్ స్టేషన్‌లో ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రరెడ్డి, ఆయన భార్య జయమ్మ, కోడలు గేయారెడ్డి అనంతపురంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి నంద్యాలకు వస్తున్నారన్నారు. తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలోని ఉన్న ఘాట్‌రోడ్డు దాటుకొని వస్తుండగా పెద్దమ్మ గుడి వద్ద ఒక్కసారిగా కారు ఎడమ టైర్ పేలి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో చిట్టెపు సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెండాడు. ఎస్టీ హెడ్‌కానిస్టేబుల్ నాగేంద్రరెడ్డికి కాలుకు తీవ్ర గాయం అయ్యింది. కారులో వెనుక సీట్లో కుర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో హైవే, 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన సురేష్‌రెడ్డి మృతదేహాన్ని గ్యాస్ కట్టర్ సహాయంతో డోర్‌ను తొలగించి బయటకుతీశారు. విషయం తెలుసుకున్న పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. దెబ్బతిన్న కారును తొగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు.
ఇటీవలే కుమార్తె వివాహం..
మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన చిట్టెపు సురేష్‌రెడ్డి కుమార్తె వివాహం రెండు నెలల క్రితమే జరిగింది. ఈయన 1993 నుంచి 1999 వరకు ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించారు. అనంతరం కర్నూలు, ఆదోని, పాణ్యం స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తూ 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొండారు. సురేష్‌రెడ్డి మృతి చెందిన వార్త తెలుసుకున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


