శ్రీశైల శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, దేవస్థాన కీర్తి ప్రతిష్టలను పెంచేలా కృషి చేయాలని దేవస్థానానికి ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దేవస్థాన | - | Sakshi
Sakshi News home page

శ్రీశైల శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, దేవస్థాన కీర్తి ప్రతిష్టలను పెంచేలా కృషి చేయాలని దేవస్థానానికి ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దేవస్థాన

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలని తెలుసుకున్నాడేమో కానీ.. అధికారంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడేమో.. శ్రీశైలం దేవస్థానం సభ్యుల్లో ఒకరు. ఓ వైపు దేవస్థానం అభివృద్ధిని విస్మరిస్తూ.. మరో వైపు ఉద్యోగులను అగౌరపరుస్తూ.. అందని కాడికి దోచుకుంటున్న ఓ సభ్యుడి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానంలో అన్ని విభాగాలపై పట్టు సాధించేందుకు ఒక్కొ విభాగానికి ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. వీరిలో ఒకరు కన్వీనర్‌గా, మరో ఇద్దరిని సభ్యులుగా ఉంటారు. ఆ విభాగంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతాయని ఆ కమిటీ పర్యవేక్షిస్తుంది. క్షేత్రంలో అనునిత్యం పలు అభివృద్ధి పనులు చేపట్టే విభాగంలో తనకి అనుభవం ఉందని, సబ్‌ కమిటీ కన్వీనర్‌గా పట్టుబట్టి మరి ఆ అభివృద్ధి పనులు చేపట్టే విభాగానికి కన్వీనర్‌గా నియమించుకునేలా చేశాడట. సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అ విభాగపు అధికారులు, సిబ్బందితో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నాడని తెలుస్తుంది. దేవస్థాన ట్రస్ట్‌బోర్డు సమావేశాల్లో సదరు సభ్యుడు అధికారులను నిలబెట్టి మరీ ప్రశ్నించడం, దేవస్థాన అధికారులకు కనీస మర్యాద కూడా ఇవ్వరనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల చర్చనీయాంశమైన ఓ విషయంపై బల్లలు గుద్ది ప్రశ్నించడం, ఇకపై ‘మీ జాతకం అంతా చెబుతా’ అంటూ అధికారులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికి సభ్యుడి వ్యవహారంతో ట్రస్ట్‌బోర్డు అభాసుపాలవుతోంది.

కాటేజీ కేటాయించాల్సిందే..

ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌కు మాత్రమే దేవస్థాన కాటేజీ కేటాయిస్తారు. సభ్యులకు మల్లికార్జున సదన్‌, గణేశసదన్‌ కేటాయిస్తారు. అయితే సదరు సభ్యుడు తాను ఎప్పుడు వచ్చిన చైర్మన్‌కు కేటాయించినట్లే తనకి కూడా కాటేజీ కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేవాడని సమాచారం. చేసేదేమి లేక అధికారులు కాటేజీ కేటాయించేవారట. అయితే ఉచితంగా కాటేజీ కేటాయించడంపై సభ్యుల్లో చర్చ జరగడం, ఉచితంగా కాటేజీ తీసుకుంటే మిగతా సభ్యులందరూ కూడా కాటేజీ కావాలని తమని అడిగితే సమస్య వస్తుందని, ట్రస్ట్‌బోర్డుపై కూడా విమర్శలు వస్తాయని సున్నితంగా ఆ సభ్యుడిని హెచ్చరించినట్లు సమాచారం. ఆతర్వాత ఉచితంగా తీసుకోకుండా నెల్లూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిర్మించిన కాటేజీలో డోనర్‌ కూపన్‌ తీసుకుని సగం అద్దె చెల్లిస్తూ అదే కాటేజీలో బస చేస్తూ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

ఆయన రూటే సప‘రేటు’..

దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు చేపట్టే ఓ విభాగానికి సబ్‌ కమిటీ కన్వీనర్‌ కావడంతో ఏ పని చేయాలన్న తనకు చెప్పాలని అధికారులకు హుకుం జారీ చేశాడట. అంతేకాకుండా ఆ విభాగంలో కాంట్రాక్ట్‌ బేసిక్‌ కింద పనిచేసే ఓ అధికారిని తన అనుచరుడిగా చేసుకుని, వసతి ఉంటున్న కాటేజీకి అతనిని పిలిపించుకుని దేవస్థానంలో ఏమి అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటిలో లోపాలు ఏంటని సమాచారం రాబట్టుకుని సదరు పని పర్యవేక్షిస్తున్న అధికారిని పిలిపించుకుని అతడిని బెదిరించడం పరిపాటిగా మారిందని సమాచారం. అలాగే ఆయా పనులు పర్యవేక్షిస్తున్న అందరి నుంచి అమ్యామ్యాలు వసూలు చేసి తనకు ఇవ్వా లని తన అనుచరుడిగా ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించి అల్టిమేటం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన తీరుతో అధికారులు తలలు పట్టుకున్నారు.

పెద్దాయనది ఏమీ లేదు..

ట్రస్ట్‌బోర్డుకు పెద్దదిక్కుగా ఉన్న ఆయనకు ఇటీవల ఓ శస్త్ర చికిత్స జరిగి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనారోగ్య కారణాలతో రెండు ట్రస్ట్‌బోర్డు సమావేశాలకు శ్రీశైలానికి వచ్చి ప్రత్యక్షంగా హాజరుకాలేక వర్చువల్‌గా హాజరయ్యారు. దీంతో ఇంకా ఆ పెద్దాయనది ఏమి లేదు..అంత మనం ఎలా చెబితే ‘అలా’ అంటూ, ట్రస్ట్‌బోర్డును నేనే నడిపిస్తా.. మీరు సహకరించాలంటూ సభ్యులతో అంతర్గతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. తాను సభ్యుడిని అని మరచిపోయి దేవస్థాన అన్ని విభాగ అధికారులను కూడా చైర్మన్‌ హోదా తరహాలోనే ఆదేశాలు జారీ చేస్తారని దేవస్థాన అధికారులు గుసగులాడుకుంటున్నారు.

శ్రీశైలం ట్రస్ట్‌బోర్డులో

చర్చనీయాంశమైన ఓ సభ్యుడి

వ్యవహరశైలి

సభ్యుడి ప్రవర్తనతో

అభాసుపాలవుతున్న ట్రస్ట్‌బోర్డు

అభివృద్ధి పనులు చేపట్టే విభాగానికి

పట్టుబట్టి కమిటీ కన్వీనర్‌గా

ఎప్పుడు వచ్చినా కాటేజీ

కేటాయించాల్సిందేనని హుకుం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement