ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

డోన్‌ టౌన్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌, డోన్‌ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్‌పాల్‌ ప్రసాద్‌ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. itiadmissions.ap.gov.in/iti అనే వెబ్‌ సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకుని ప్రింట్‌ కాపీని తీసుకోని దీనితో పాటు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల్లో జూలై 2 తేదీ లోపు వెరిఫికేషన్‌ చేయించుకోవాలన్నా రు. వెరిఫికేషన్‌ చేయించకపోతే మెరిట్‌ లిస్ట్‌లో పేర్లు చేర్చబోమన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జర్నలిస్టు పిల్లలకు స్కూల్‌ ఫీజులో 50 శాతం రాయితీ

నంద్యాల(అర్బన్‌): జిల్లాలోని ప్రైవేటు, కార్పొ రేట్‌ పాఠశాలల్లో అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తున్నా మని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి సోమవారం తెలిపారు. ఈ మేరకు రాయితీకి సంబంధించిన జీవో కాపీని ఆమె జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. అహర్నిశలు సమాజ బాగు కోసం శ్రమించే జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలో చేరికకు రాయితీని ప్రకటించామన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 128 ఫిర్యాదులు

బొమ్మలసత్రం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి 128 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు వివిధ సమస్యలను తనకు తెలియజేశారన్నారు. చట్టపరిధిలో సమస్యల ను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లా డి పరిష్కారం చూపామన్నారు. మిగతా సమస్యలను ఆయా స్టేషన్ల అధికారులకు బదీ లీ చేశామని, నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించేలా ఆదేశించామన్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

నంద్యాల(వ్యవసాయం): రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆంధ్ర ప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ చైర్మన్‌ ప్రమోద్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం క్రెడిట్‌ ఔట్రీచ్‌ ప్రోగ్రాం ద్వారా రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.27.25 కోట్ల విలువ చేసే రుణాలను ఖాతాదారులకు అందజేశారు. అనంతరం ప్రమోద్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. తమ బ్యాంకు ద్వారా గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా, ఆస్తి తనాఖా రుణాలు అతి తక్కువ వడ్డీతో మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ అధికారి సుధాకర్‌, స్ఫూర్తి కిరణ్‌, అమిత్‌ కుమార్‌, శేషసాయి కిరణ్‌, సృజన్‌ సీనియర్‌ మేనేజర్లు రమణయ్య, శేఖర్‌, బ్రాంచ్‌ మేనేజ ర్లు రీజన్‌ ఆఫీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సీనియర్‌ సహాయకులుగా ముగ్గురికి పదోన్నతి

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్‌ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి సీనియర్‌ సహాయకులుగా పదోన్నతి కల్పించారు. సోమవారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు సీనియర్‌ సహాయకులకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్‌ ఆర్డర్స్‌ను అందించారు. పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పదోన్నతి పొందిన వారిలో పీ మల్లికార్జున రావునును ఆదోని ఎంపీపీ, డీ కిరణ్‌కుమార్‌ను పీఆర్‌ క్యూసీ సబ్‌ డివిజన్‌ కర్నూలు, డీ మౌలాలిని ఎంపీపీ పాణ్యంకు నియమించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement