నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి

Jul 3 2026 1:46 AM | Updated on Jul 3 2026 1:46 AM

వ్యవసాయ విశ్వ విద్యాలయం డీఎస్‌ఏ డాక్టర్‌ సంపత్‌కుమార్‌

మహానంది: ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించా లని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీఎస్‌ఏ డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు. మహానంది ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలలో గురువారం రాత్రి కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ శ్యామ్‌రాజ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో కాలేజ్‌ డే, హాస్టల్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కాలేజ్‌ సావనీర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. మహానంది వ్యవసాయ కళాశాల అభివృద్దికి రూ. కోటి నిధులు కేటాయిస్తున్నామని, రూ. 75 లక్షలతో ఎగ్జామినేషన్‌ హాలు, రూ. 25 లక్షలతో బాలికల హాస్టల్‌ నిర్మిస్తామన్నారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ వి. జయలక్ష్మీ మాట్లాడుతూ.. వ్యవవసాయ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. క్రమశిక్షణతో చదువుతూ మంచి గుర్తింపు పొందాలని సూచించారు. కళాశాల బెస్ట్‌ స్టూడెంట్‌గా నిలిచిన వి.నిఖిలతో పాటు మంచి మార్కులు పొందిన వారు, క్రీడల్లో రాణించిన వారికి సర్టిఫికెట్స్‌తో పాటు మెమెంటోలు అందించి అభినందించారు. వేడుకల్లో మహానంది కళాశాల ఓఎస్‌ఏ వీరయ్య, వార్డన్‌ విజయభాస్కర్‌, సీనియర్‌ ఫ్రొఫెసర్‌ జాన్సన్‌, అధ్యాపకులు డాక్టర్‌ గీతా శిరీష, డాక్టర్‌ మాధవి, డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ త్రివిక్రమ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement