● ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి
పగిడ్యాల: హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల కడుపు కొట్టి అక్రమాలకు పాల్పడితే ఇంటికి పోతారని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలో విస్తృత తనిఖీ లు చేపట్టారు. ఉదయం ఆయన లక్ష్మాపురం అంచె వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. బియ్యం నిల్వలు, నూనె, కూరగాయలు, కోడిగుడ్ల నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం పిల్లలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పిల్లల కోరిక మేరకు మెనూలో ఉప్మా స్థానంలో టమాట రైస్ లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అక్కడి నుంచి లక్ష్మాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన స్టాక్‌ను, అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలోని మూడు రేషన్ దుకాణాలను తనిఖీలు చేపట్టారు. అనంతరం పగిడ్యాలలోని 7వ అంగ న్‌వాడీ కేంద్రం కార్యకర్త ప్రభావతి, ఎస్సీ హస్టల్ వార్డెన్ తిరుపాలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇచ్చే మెనూలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యా దులు ఉన్నాయని పద్ధతి మార్చుకోకపోతే ఇంటికి పోతారని మందలిచ్చారు. మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా బాలికల విద్యాలయం, పాలమర్రి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్‌ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోప్యాయులు, ఉపా ధ్యాయ బృందం సన్మానించారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ శంకర్‌ప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


