మహానేత పచ్చని అడుగులు | - | Sakshi
Sakshi News home page

మహానేత పచ్చని అడుగులు

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

ఆత్మకూరు: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జలసిరి ప్రదాతగా రైతన్నల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. జలయజ్ఞంలో భాగంగా ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో లింగాల, ఇస్కాల, చెలిమిల్ల, సిద్ధ్దాపురం, శివపురం ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసి రైతుల మోములో చిరునవ్వులు చిగురింపజేశారు. ఒకప్పుడు కరువుతో బీటలు బారిన బీళ్లు ఎత్తిపోతల పథకాలతో ఆయకట్టుగా మారాయి. దాదాపు 30 వేల ఎకరాలు ఆయకట్టుగా మారి రైతుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. వైఎస్సార్‌ మరణించినా ఆయన పచ్చని అడుగు జాడలు ఇప్పటికీ బంగారు భూముల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడి రైతులు మహానేత చేసిన మేలును నిత్యం తలుచుకుంటూ స్మరించుకుంటున్నారు.

ఎత్తిపోతలతో సస్యశ్యామలం

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయకపోతే మా ప్రాంతం నిత్యం కరువుతో అలమటించేది. ఏటా వలసలు వె ళ్లి జీవించాల్సిన పరిస్థితి ఉండేది. ఆయన చొరవతో రైతుల పరిస్థితి మారింది. పొలా లకు సాగునీరు అందుతుండటంతో నీటి కష్టాలు తొలగిపోయాయి. మహానేత రైతుల కోసం ఎంతో కృషి చేశారు. – విష్ణువర్ధన్‌రెడ్డి, సిద్ధాపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement